Thalapathy Vijay: పార్టీ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్

Thalapathy Vijay: పార్టీ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్

తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, అగ్ర తమిళ నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay)  గురువారం (ఆగస్ట్ 22న) తన రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. చెన్నై పనైయుర్ లోని పార్టీ కార్యాలయంలో తన పార్టీ జెండాను, గుర్తును ఆవిష్కరించిన సందర్భంగా విజయ్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.

ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులతో పాటు మద్దతుదారులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

“మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేం తొలగిస్తాం. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమానహక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తాం. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తాం’’ అని విజయ్‌ ప్రతిజ్ఞ చేశారు.

ఈ ఏడాది 2024 ఫిబ్రవరిలో, విజయ్ తమిళగ వెట్రి కజగం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. వచ్చే తమిళనాడు 2026 అసెంబ్లీ  ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు విజయ్.

 

విజయ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధంలేకుండా ఇండియన్ వైడ్ గా ఆయనకు కోట్ల సంఖ్యలు అభిమానులు ఉన్నారు. అందుకే విజయ్ రాజకీయాల్లోకి వస్తుండటంతో ఫ్రెష్ ఫీలింగ్ వస్తోంది. ఏదైనా సాధించే సత్తా,ఆ విజన్, ముందుకు నడిపే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది ఈ సినిమా.