
విజయ్ వర్మ(Vijay Varma).. ప్రస్తుతం ఈ పేరు బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. మాములుగా మన పెద్దలు ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ విజయ్ వర్మ మాత్రం బాలీవుడ్ లో సక్సెస్ అయ్యాక టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అయినా అతనికి బాలీవుడ్ యాక్టర్ గానే గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఈ నటుడు.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నాను రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు విజయ్.
ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ వర్మ సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన సినీ జర్నీ గురించి మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ రూ.18. అప్పుడు నాకు రిపోర్టర్‌గా చేయమని ఒక ఆఫర్ వచ్చింది. ఒక్క రోజు షూటింగ్.. మూడు వవేలు ఇస్తామని చెప్పారు. చేయడం ఇష్టం లేకపోయినా కేవలం డబ్బు కోసం ఒప్పుకున్నాను. తీరా షూటింగ్ కు వెళ్ళాక రిపోర్టింగ్ ఇంగ్లీష్‌లో చేయమన్నారు. అది నావల్ల కాలేదు. దాంతో సెట్‌లోనే నన్ను రిజెక్ట్ చేశారు. నిజం చెప్పాలంటే.. నేను అప్పటికే మాన్‌సూన్ షూట్ అవుట్ సినిమాలో కీ రోల్ చేశాను. అయినా కూడా ఇలాంటి పాత్రలు చేసి సెట్ లో రిజెక్ట్ చేయబడ్డాను.
అప్పుడే నాకు అర్థమైంది డబ్బు కోసం ఏది పడితే అది చేయకూడదని. అప్పటినుండి నుంచి ఇప్పటివరకు డబ్బుల కోసం కాకుండా.. నాకు నచ్చిన పాత్రలు మాత్రమే చేసుకుంటూ వాచ్చాను.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు విజయ్ వర్మ. ప్రస్తుతం విజయ్ వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అది విన్న నెటిజన్స్ విజయ్ వర్మ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.