మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో కౌసల్య కృష్ణమూర్తి..

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో కౌసల్య కృష్ణమూర్తి..

అందం, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సినీ తార ఐశ్వర్య రాజేష్. చిన్నతనంలోనే రాంబంటు మూవీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో తొలిసారిగా కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత సరిపోలలేదు, టక్ జగదీష్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న నటి ఐశ్వర్య రాజేష్..ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. 

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ను సందర్శించిన ఆమె..అందుకు సంబంధించిన  ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.