Anjali: గేమ్ ఛేంజర్ తన పాత్ర గురించి చెప్పిన అంజలి..చరణ్‌తో ఫ్లాష్ బ్యాక్‌లో..

Anjali: గేమ్ ఛేంజర్ తన పాత్ర గురించి చెప్పిన అంజలి..చరణ్‌తో ఫ్లాష్ బ్యాక్‌లో..

తెలుగు నటి అంజలి(Anjali) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ, అంజలి విషయంలో మాత్రం అది రివర్స్ అనే చెప్పాలి. తెలుగమ్మాయి అయినా ఆమె ముందుకు తమిళ సినిమా ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ తరువాత వరుస అవకాశాలు అందుకుంది అంజలి.

ఇక తాజాగా ఆమె నటిస్తున్న గ్యాంగ్స్ గోదావరి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మాస్ కా దాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో నిమగ్నమయ్యారు టీమ్.ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన మీడియా మీట్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు అంజలి.

అదేంటంటే.."తనది గేమ్ ఛేంజర్ మూవీలో ఎలాంటి కీలక పాత్ర కాదని.,కేవలం ఒక హీరోయిన్ పాత్ర మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్‌ కియారా అడ్వాణీ, అంజలి ఓ పాత్ర పోషిస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అది గాసిప్‌. తనకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌, ఓ అందమైన పాట  సాంగ్ కూడా తన మీద కంపోజ్ చేశారని" ఆమె వెల్లడించింది.

అయితే, ఇక సినిమా గురించి తన కంటే ఎక్కువగా..డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు గాని వెల్లడిస్తేనే కరెక్ట్ గా ఉంటుందని తెలిపింది. ఎందుకంటే,తమకు ఈ సినిమా విషయంలోనైనా..చేస్తున్న సినిమా గురించి బయట ఎక్కువగా మాట్లాడవద్దని పలు కండిషన్స్ ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది.

అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి మాట్లాడుతూ..'నేను రత్నమాల అనే మాసీ పాత్రలో నటించాను. నా కెరీర్ లో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పాత్ర చేయలేదు. ఒక సినిమాలో బూతులు మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమ్. నిజ జీవితంలో కూడా ఎప్పుడు బూతులు వాడను. అలాంటిది రత్నమాల పాత్ర కోసం దర్శకుడు నన్ను అనుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది..అంటూ చెప్పుకొచ్చారు అంజలి.