
టాలీవుడ్ నటి ఎస్టర్ నోరోన్హా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లి, విడాకులు, రెండో పెళ్లి గురించి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఆమె ది వేకెంట్ హౌస్ అనే సినిమా చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో నటిస్తూనే నిర్మాతగా, దర్శకురాలిగా కూడా చేస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ది వేకెంట్ హౌస్ సినిమా గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ది వేకెంట్ హౌస్ సినిమా చాలా బాగా వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము. మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది.. అన్నారు.
అనంతరం తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నేను రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది. ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు. ఇలా మాట్లాడితే ట్రోల్స్ చేస్తున్నారు. వేశ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆడవాళ్లకు కోరికలు ఉండవా.? వాళ్లకి కూడా ఒక జీవితం ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి.. అంటూ చెప్పుకొచ్చారు ఎస్తేర్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.