రేవ్​పార్టీ, డ్రగ్స్​కేసులో నటి హేమకు మళ్లీ నోటీసులు

రేవ్​పార్టీ, డ్రగ్స్​కేసులో నటి హేమకు మళ్లీ నోటీసులు
  •     1న విచారణకు హాజరుకావాలని ఆదేశించిన బెంగళూరు సీసీబీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : బెంగళూరు రేవ్‌‌‌‌ పార్టీ, డ్రగ్స్ కేసులో సినీ నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌‌‌‌(సీసీబీ) పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 1న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం హేమకు నోటీసులు అందించారు. బెంగళూరులో జరిగిన రేవ్‌‌‌‌ పార్టీలో హేమ కూడా పాల్గొన్నదని సీసీబీ పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో మరో 85 మందితో పాటు హేమకు కూడా గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే, తనకు వైరల్‌‌‌‌ ఫీవర్‌‌‌‌ వచ్చిందని, విచారణకు రాలేనని హేమ చెప్పారు. దీంతో ఆమెకు మరోసారి తాజాగా నోటీసులు ఇచ్చారు.