
బెంగళూరు జైలు నుండి సినీ నటి హేమ(Hema) విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆమెకు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇందులో భాగంగా ఆమె శుక్రవారం(జూన్ 14) బెంగళూరు జైలు నుండి నుండి విడుదల అయ్యారు. ప్రస్తుతం ఆమె విడుదలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
గత నెలలో బెంగళూరు శివారులోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. ఈమేరకు ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక తాజాగా ఆమెకు బెయిల్ రావడంతో బెంగుళూరు జైలు నుండి బయటకు వచ్చారు నటి హేమ.