
కదులుతున్న రైల్లోంచి కిందకు దూకేసింది బాలీవుడ్ నటి కరిష్మా శర్మ. దీంతో ఆమె త్రీవంగా గాయపడింది. అసలు తానుఎందుకలా చేయాల్సి వచ్చిందో తెలుపుతూ ఇన్ స్టా స్టోరీలో కరిష్మా పోస్ట్ పెట్టారు. "నిన్న ఓ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లడానికి చీర ధరించి బయల్దేరాను. నేను ముంబయి లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలింది. దీంతో నా స్నేహితులు దాన్ని అందుకోలేకపోయారు. వాళ్లు రైలు ఎక్కలేకపోయారనే టెన్షన్, భయంతో నేను కిందికి దూకేశానని చెప్పింది.
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని కరిష్మా శర్మ తెలిపింది. దురదృష్టవశాత్తూ వెనక్కి తిరిగిపడడంతో వీపు, తలకు దెబ్బలు తగిలాయి అని ఇన్ స్టాలో రాసుకొచ్చారు. శరీరమంతా చిన్నచిన్న గాయాలైనట్లు కరిష్మా తెలిపారు. తలకు దెబ్బ తగలడంతో డాక్టర్లు ఎంఆర్ఐ చేశారని.. ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్లు చెప్పారు. తాను ధైర్యంగా ఉన్నానన్నారు. తాను త్వరగా కోలుకోవాలంటే అందరి ప్రేమాభిమానాలు కూడా కావాలని తెలిపారు.
►ALSO READ | Vijay-Rashmika : విజయ్ దేవరకొండతో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ.. అసలు నిజం ఇదే!
కరిష్మా శర్మ 'ప్యార్ కా పంచనామా 2', ఉజ్దా చమాన్, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సినిమాల్లో నటించడంతో పాటు 'రాగిని ఎంఎంఎస్: రిటర్న్స్' వెబ్ సిరీస్ లో నటించి అలరించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లలో నటిస్తోంది.