ఫ్యామిలీ స్టార్ కోసం పూజలు

ఫ్యామిలీ స్టార్ కోసం పూజలు

‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్‌‌ ఠాకూర్..  ఇటు తెలుగు, అటు హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ బ్యాలెన్స్ చేస్తోంది.  విజయ్ దేవరకొండకి జంటగా ‘ఫ్యామిలీ స్టార్‌‌‌‌’ చిత్రంలో నటించిన ఆమె.. ప్రస్తుతం ప్రమోషన్స్‌‌లో బిజీగా ఉంది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌లోని బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని  సందర్శించింది మృణాల్. 

ప్రత్యేక పూజలతో  అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని, ఆశీర్వాదాలు తీసుకుంది. ‘ఏదైనా కొత్త, లేదా పెద్ద పనిని మొదలుపెట్టేముందు టెంపుల్‌‌కి వెళ్లి పూజ చేయిస్తే మంచిదని మా పేరెంట్స్ చెప్పారు. అందుకే ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న సందర్భంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తను పూజలు చేయిస్తున్న  వీడియో వైరల్ అవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా మరో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘మధురము కదా’ అంటూ సాగే పాట ప్రోమోను ఈరోజు, ఫుల్ సాంగ్‌‌ను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్టు అప్‌‌డేట్ ఇచ్చారు. దివ్యాన్ష కౌశిక్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి  గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.