సీఎంఆర్‌‌‌‌ షాపింగ్‌‌మాల్‌‌ బ్రాండ్‌‌ అంబాసిడర్‌‌‌‌గా మృణాల్ ఠాకూర్‌‌‌‌

సీఎంఆర్‌‌‌‌ షాపింగ్‌‌మాల్‌‌ బ్రాండ్‌‌ అంబాసిడర్‌‌‌‌గా మృణాల్ ఠాకూర్‌‌‌‌

న్యూఢిల్లీ: సీఎంఆర్ షాపింగ్ మాల్‌‌  నటి మృణాల్‌‌ ఠాకూర్‌‌‌‌ను బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా నియమించింది. ఇప్పటికే  టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా పనిచేస్తున్నారు.  గత 40 ఏళ్లుగా కస్టమర్ల అవసరాలకు తగ్గ దుస్తులను  సీఎంఆర్ షాపింగ్ మాల్ అమ్ముతోందని మృణాల్ అన్నారు. 

 పెళ్లిళ్ల కోసం పట్టు వస్త్రాలు, యువత కోసం సరికొత్త ఫ్యాషన్స్‌‌, పిల్లల కోసం కిడ్స్‌‌వేర్‌‌  అందుబాటులో ఉంచుతోందని పేర్కొన్నారు. తమ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా మృణాల్‌‌ నియమితులవ్వడం తమకు సంతోషాన్నిచ్చిందని  సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎండీ మావూరి మోహన్‌‌ బాలాజీ  చెప్పారు. ట్రెండ్‌‌కు తగ్గట్టు  అన్ని రకాల దుస్తులు తమ దగ్గర దొరుకుతాయని చెప్పారు.