
టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా స్వల్పంగా గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రాశికన్నా గాయాలతో కూడిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇందులో ముక్కు నుంచి రక్తం, చేతులకు గాయాలు, ముఖంపై చిన్నపాటి గాటుతో కూడిన రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. సినిమా పట్ల తనుకున్న అంకిత భావాన్ని, డెడికేషన్ ను తెలుపుతూ ఫొటోలకి ఇచ్చిన క్యాప్షన్ ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది.
'ఒక్కోసారి కథ డిమాండ్ చేస్తే గాయలను కూడా లెక్కచేయకూడదు. ఈ క్రమంలో మీ గాయాలు కూడా ఒక్కోసారి మీ శరీరం, మీ శ్వాస మీద ప్రభావం చూపవచ్చు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రాశికన్నా బాలీవుడ్ లో ఫర్జీ-2 వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ లోనే గాయపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు.
ఫర్జీ-2 వెబ్ సిరీస్:
ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2023లో విడుదలైంది. ఈ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్, రాశీ ఖన్నా మరియు భువన్ అరోరా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ లో ఓ వ్యక్తి నకిలీ డబ్బును తయారు చేయడానికి ప్రయత్నించే కథను చెబుతుంది. రాజ్ & డికె ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇప్పుడు దీన్నీ సీక్వెల్ గా ఫర్జీ-2 వెబ్ సిరీస్ వస్తోంది.