
నటి రేణు దేశాయ్(Renu desai) దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈమేరకు ఆమె తన ఇంస్టాగ్రామ్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎమోషనల్ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ ప్రైడ్ మూవీ బాహుబలి(Bahubali) సినిమాను ఇటీవల నార్వోలోని స్టావెంజర్ నగరంలోని ఓ థియేటర్‌లో ప్రదర్శించారు. ఆ సినిమా చూసేందుకు రేణు దేశాయ్ కుమారుడు అఖీరా(Akhira) తో కలిసి వెళ్లారు. ఈ సంధర్బంగా ఆమె అనుభూతి చెందిన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగానే ఆమె రాజమౌళిని ప్రశంసిస్తూ ఒక నోట్ కూడా రాశారు.
రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో.. ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం నాకు చాలా అద్భుతంగా, గర్వంగా ఉంది. రాజమౌళి సార్.. ప్రేక్షకుల కోసం మీరు సృష్టించిన ఈ అనుభూతిని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. స్టావెంజర్‌లోని థియేటర్‌లో బాహుబలి చూసిన ఆ అనుభూతి ఎన్నటికీ మరిచిపోలేనిది. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు నిర్మాత శోబు(Shobu) సార్‌కు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్ రాసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.