నటి సదా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె పెళ్లి గురించి, విడాకుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిపై తనకు ఇంట్రెస్ట్ లేదని? అలా ఎలా కలిసి ఉంటారో తనకు అర్థం కారని, విడాకులు తీసుకుంటే తప్పేంటీ అంటూ చెప్పుకొచ్చారు సదా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. జయం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా ఆ తరువాత కూడా వరుసగా సినిమాలు చేశారు. కానీ, అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. దాంతో కొంతకాలం నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె.. షోస్ లో జెడ్జ్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. అయితే.. ఆమె ఇప్పటికీ సింగల్ గానే ఉన్నారు. పెళ్లి గురించి ఎప్పటికప్పుడు మాత్ర దాటేస్తూ వచ్చిన ఆమె తాజాగా ఆ విషయంపై నోరు విప్పారు.
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. నేను చిన్నప్పటినుండి స్వేచ్ఛగా పెరిగాను, నచ్చిన పని చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే ఈ ఫ్రీడమ్ ను పోగొట్టుకోవాలనుకోవడం లేదు. అయినప్పటికీ.. నాకు నచ్చిన వ్యక్తి కూడా ఇప్పటివరకు దొరకలేదు. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. ఒక చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. అరేంజ్డ్ మ్యారేజ్ కాన్సెప్ట్ నాకు నచ్చదు. పరిచయం లేని వ్యక్తితో పెళ్లి, కలిసి ఉంటడం ఏంటో నాకు అర్ధం కాదు. ఒకవేళ.. నేను పెళ్లి చేసుకున్నాక లైఫ్ కష్టంగా మారిందనిపిస్తే కచ్చితంగా విడాకులు తీసుకుంటాను. అందులో తప్పేమీ లేదు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సదా.
