కళ్లద్దాలతో బామ్మలా కనిపిస్తున్న సమంత

కళ్లద్దాలతో బామ్మలా కనిపిస్తున్న సమంత

సీనియర్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ వ్యాధి ఉందని చెప్పినప్పటి నుంచి ఆమెకు.. ఫ్యాన్ పాలోయింగ్ మరింత ఎక్కువైంది. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఆమె అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా.. సమంత ఫోటో చూసిన అభిమానులు.. ఇంతలా మారిపోయింది ఏంటి అంటూ తెగ ఫీల్ అవుతున్నారు. కళ్లద్దాలు ధరించి.. రెండు చేతులు పైకి ఎత్తి వేళ్లను క్రాస్‭గా చూపిస్తూ.. కిందికి చూస్తున్న ఆమె ఫోటో పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంత.. బామ్మలా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల తన అనారోగ్యం గురించి వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. కొంతమంది తాను చనిపోయినట్లు రాయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇంకా చావలేదు అంటూ సామ్ ఎమోషనల్ అయ్యారు. 

సమంత నటించిన ‘యశోద’ మూవీ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సమంత.. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ.. యశోద సినిమా షూటింగ్ పూర్తి చేశారు. సమంత నటించిన యశోద మూవీ సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోంది. ఆమెతో పాటు ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు నటించారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో యశోద రిలీజ్ కాబోతోంది.