గ్లామర్ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ గా లేరు

గ్లామర్ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ గా లేరు

జీవితంలో తాను చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నానన్నారు సినీ నటి సమంత. హైద్రాబాద్ లో రోష్ని  ట్రస్ట్ ఏర్పాటు చేసిన  సైకియాట్రి ఎట్  యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో పాల్గొన్నారు  సమంత. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె..‘నా జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా అలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్యుల సహాయం తీసుకున్నాను. నేను ఈ రోజు ధైర్యంగా నిలబడటానికి,జీవితంలో ముందుకి సాగటానికి నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సహయమే కారణం. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను కలుస్తామో..... అలాగే మనసుకి గాయం అయినప్పుడు వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అంత బాగుంది అన్నట్లు పోస్ట్ లు పెడ్తారు కానీ గ్లామర్ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ గా లేరు’అని అన్నారు.