బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ తండ్రికి బెదిరింపు కాల్

బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ తండ్రికి బెదిరింపు కాల్

అమృత్‌సర్: బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ తండ్రి సంతోష్ సింగ్ సుఖ్ కు బెదిరింపు కాల్ వచ్చింది. దీపావళికి ముందే తనను చంపుతానంటటూ హాపీ అనే వ్యక్తి ఫోన్ చేశారని సంతోష్ సింగ్ సుఖ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సంతోష్ సింగ్ సుఖ్ మాట్లాడారు. తాను హిందూ నాయకుడిని కాబట్టే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. పంజాబ్ లో తనలాంటి వ్యక్తులకు రక్షణ లేదని సంతోష్ సింగ్ సుఖ్ ఆరోపించారు. తనను బెదిరించిన వ్యక్తిని త్వరగా పట్టుకోవాలని, లేకుంటే పంజాబును వదిలి చండీఘడ్ కు గానీ లేక ముంబయికి గానీ వెళ్తానంటూ స్పష్టం చేశారు.

ఇక ఈ విషయమై అమృత్‌సర్ ఎస్పీ జస్వంత్ కౌర్ స్పందించారు. సంతోష్ సింగ్ సుఖ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆమె తెలిపారు. ఆయనకు ఇప్పటికే ఇద్దరు గన్‌మెన్‌లు ఉండగా... మరో గన్‌మేన్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక నిందితుడిని పట్టుకునేందుకు అతడి ఫోన్ కాల్స్ ట్రేస్ చేస్తున్నామని, సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.