తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపిన హీరోయిన్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్

తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపిన హీరోయిన్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్

టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ గణేష్ నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ ఇరగదీసింది. తన అపార్ట్మెంట్లో ప్రతిష్ఠించిన గణేషుడి నిమజ్జన ఊరేగింపులో పాల్గొని తీన్మార్ స్టెప్పులేసింది. ఓ పక్క వర్షం పడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో స్టెప్పులేస్తూ అందర్నీ ఆకర్షించింది. ఈ బ్యూటీ కేవలం తన కిరాక్ డ్యాన్స్ తోనే కాకుండా డ్రమ్స్ వాయించి అసలైన పండగ ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

ఇందుకు సంబంధించిన వీడియోని స్వయంగా శ్రద్ధాదాస్ తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ క్రమంలో తన డ్యాన్స్ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లను నుంచి మంచి టాక్ అందుకుంటోంది. గణేష్ నిమజ్జన వేడుకల్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు శ్రద్ధా తీన్మార్ స్టెప్పులు చూసేయండి. కాగా ఈ గణేష్ నిమజ్జన వేడుక.. శ్రద్ధా హోమ్ టౌన్ 'ముంబై'లో అని తెలుస్తుంది. 

శ్రద్ధాదాస్ సినిమాల విషయానికి వస్తే.. 

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో ఈ బ్యూటీ అందానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలాగే ప్రభాస్ డార్లింగ్ మూవీ లోనూ సెకెండ్ హీరోయిన్గా మెప్పించింది.

►ALSO READ | KishkindhapuriTrailer: వణుకు పుట్టిస్తున్న‘కిష్కిందపురి’ ట్రైలర్..

సిద్ధూ నటించిన ‘గుంటూరు టాకీస్’లో బోల్డ్గా నటించి ఆకట్టుకుంది. అలాగే, శ్రద్ధాదాస్..'డిక్టేటర్, నాగవల్లి, మరో చరిత్ర, మొగుడు, రేయ్, ఏక్ మినీ కథ, పారిజాత పర్వం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్ల్లో నటిస్తూనే.. బుల్లితెరపై పలు డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.