మొక్కలు నాటిన ధమాకా బ్యూటీ

మొక్కలు నాటిన ధమాకా బ్యూటీ

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హస్పిటాలిటీలో ఆమె విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఇప్పటికి 17 కోట్ల మొక్కలు నాటడం గొప్పవిషయమని శ్రీలీల అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా హీరోయిన్స్ శాన్వి శ్రీవాస్తావ్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు తన అభిమానులు మూడు మొక్కలను నాటాలని శ్రీలీల పిలుపు ఇచ్చారు.