పాపం శ్రీలీల: అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి

పాపం శ్రీలీల: అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి

పాపం శ్రీలీల(Sreeleela).. ప్రస్తుతం ఈ అమ్మడు పరిస్థితి అలాగే ఉంది. మొన్నటివరకు లక్కీ లేడీ అనుకున్న ఈ భామ ఇప్పుడు వరుసగా ప్లాప్స్  అందుకుంటోంది. ఇటీవల రామ్ తో చేసిన స్కంద సూపర్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఆదికేశవతో మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. 

రెండేళ్ల కింద పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీలీల.. ఆతరువాత వచ్చిన ధమాకాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ఈ భామ వరుస అవకాశాలు దక్కించుకుంది. హీరో ఎవరైనా కానీ.. హీరోయిన్ మాత్రం శ్రీలీలనే అనే రేంజ్ కి వెళ్ళిపోయింది ఈ అమ్మడు. అవకాశాలు రావడం వరకు బాగానే ఉంది కానీ.. సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఒప్పుకున్న సినిమాలన్నీ ఇప్పుడు నెలకు ఒకటి చొప్పున విడుదలవుతున్నాయి. కథపై కాకుండా కాంబినేషన్ పై ఫోకస్ పెడుతూ.. వరుస ప్లాప్స్ అందుకుంటోంది. దీంతో శ్రీలీల కూడా మరో కృతి శెట్టి కానుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. తర్వాత వరుసగా 5 ఫ్లాపులతో కనిపించకుండా పోయింది. అదే మళ్ళీ శ్రీలీల విషయంలో రిపీట్ కానుందా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే.. శ్రీలీల నుండి ఇకముందు వచ్చే సినిమాలన్నీ స్టార్ హీరోలవి కావడం విశేషం. అందులో.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నితిన్,నవీన్ పొలిశెట్టి,విజయ్ దేవరకొండ,రవితేజ ఉన్నారు. ఇందులో ఏ ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా శ్రీలీల కంబ్యాక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఏదేమైనా ఇకనుండైనా సినిమాల ఎంపిక విషయకలో శ్రీలీల జాగ్రత్తగా ఉండక తప్పదు.