
టాలీవుడ్ నటి సురేఖ వాణి(Surekha vani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రలు చేసి చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఓపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు సురేఖ వాణి. తన కూతురు సుప్రీతతో కలిసి నా నా హంగామా చేస్తూ ఉంటారు. మాడ్రన్ డ్రెస్సులతో, గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చలేపుతూ ఉంటారు. ఈ క్రమంలో నెటిజన్స్ నుండి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
ఇక తాజాగా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారారు సురేఖ వాణి. మగాళ్ల బుద్దిని ఉదేశిస్తూ ఆమె చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె ఒక సినిమాలో హీరోయిన్ చెప్పిన డైలాగ్ ను రిపీట్ చేశారు.. మగావాళ్ళందరూ కూడా మమ్మల్ని రీచ్ అయ్యే వరకు ఒకలా ఉంటారు. రీచ్ అయ్యాక అందరూ ఒకేలా ఉంటారు.. అనే డైలాగ్ తో రీల్ చేసింది సురేఖ వాణి. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.