బబ్లీ చాలెంజ్‌‌

బబ్లీ చాలెంజ్‌‌

హిందీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసినా.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌‌‌‌ హీరోయిన్‌‌గా ఎదిగింది తమన్నా. ఇక్కడ ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఓ హిందీ సినిమాలో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే హిమ్మత్‌‌వాలా, హమ్‌‌షకల్స్, ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, ఖామోషీ లాంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం ప్లాన్‌‌ ఎ ప్లాన్‌‌ బి, బోలె చూడియా చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పుడు మరో హిందీ సినిమాకి సైన్ చేసింది. చాందినీ బార్, పేజ్‌‌ 3, ట్రాఫిక్ సిగ్నల్‌‌ లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్‌‌ తీసిన మధుర్ భండార్కర్‌‌‌‌ డైరెక్షన్‌‌లో ‘బబ్లీ బౌన్సర్‌‌‌‌’గా మారబోతోంది తమన్నా. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. లేడీ బౌన్సర్‌‌‌‌ కథతో వస్తున్న మొదటి ఇండి యన్‌‌ మూవీ ఇది. బౌన్సర్స్‌‌ టౌన్‌‌గా ఫేమస్ అయిన అసోలా ఫతేపూర్‌‌‌‌ బ్యాక్‌‌ డ్రాప్‌‌లో ఉంటుంది. తాను గతంలో తీసిన చిత్రాలతో పోలిస్తే ఇది డిఫరెంట్‌‌గా ఉంటుందంటున్నాడు మధుర్. బౌన్సర్ పాత్ర పెద్ద చాలెంజ్ అని, ప్రేక్ష కులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని తమన్నా చెప్పింది. ఎంతో సుకుమారంగా కనిపించే ఆమె, బౌన్సర్‌‌‌‌ లుక్‌‌లోకి చేంజ్ కావడం ఛాలెంజే మరి.