తొలిప్రేమను దృష్టిలో పెట్టుకుని చేశా: నటి వాసుకి

తొలిప్రేమను దృష్టిలో పెట్టుకుని చేశా: నటి వాసుకి

‘తొలిప్రేమ’ చిత్రంలో పవన్ కళ్యాణ్‌‌‌‌కి చెల్లెలిగా నటించిన వాసుకి మళ్లీ 23 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అన్నీ మంచిశకునములే’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. స్వప్నదత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న విడుదలవుతోంది. ఈ  సందర్భంగా వాసుకి చెప్పిన విశేషాలు.

‘‘తొలిప్రేమ’ తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఫ్యామిలీ వర్క్‌‌‌‌లో బిజీగా ఉండటంతో చేయడం కుదరలేదు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. పాప మెడిసిన్ ఫోర్త్ ఇయర్,  బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. ఆనంద్ సాయి ఆయన పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది. ఇలాంటి టైమ్‌‌‌‌లోనే నందిని రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చింది. పైగా స్వప్న కూడా ఎప్పుడూ సినిమా చేయమని అడుగుతుండేది. ఫైనల్‌‌‌‌గా ఈ కథ కుదిరింది.

‘తొలిప్రేమ’ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకునే ఇందులో నటించా. చాలా క్యూట్ సిస్టర్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తా. తమ్ముడు ఏం చేసినా సపోర్ట్ చేసే అక్క పాత్ర నాది. నాకు, సంతోష్ పాత్రకు మంచి బాండింగ్ ఉంటుంది. సంతోష్ స్వీట్ పర్సన్. అక్కా అని పిలుస్తాడు. ఇందులో రిషి పాత్ర తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్‌‌‌‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ మధ్య చాలా వైలెన్స్ సినిమాలు, డిస్టర్బ్ చేసే సినిమాలే వస్తున్నాయి. హాయిగా ప్రశాంతంగా చూసే సినిమా ఇది. రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, షావుకారు జానకి లాంటి సీనియర్స్‌‌‌‌తో నటించడం హెల్తీగా అనిపించింది. ఒక మార్క్ క్రియేట్ చేసేలా పాత్రలు వస్తే మరిన్ని సినిమాలు చేస్తాను. ప్రస్తుతం సినిమాలతో పాటు చదువుపై కూడా దృష్టి పెట్టాను. సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నా’’.