నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎంతలా అంటే.. తమను తాము మరిచిపోయి పూనకాలు వచ్చేలా చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సాక్ష్యంగా నిలిచింది.
ఒంగోలులోని ఓ థియేటర్‌లో అద్భుత ఘటన జరిగింది. క్లైమాక్స్‌లో వచ్చే శివ తాండవం సన్నివేశానికి, బాలయ్య చేసే నటవిన్యాసానికి ఓ మహిళ పూర్తిగా లీనమైపోయింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూర్చొన్న సీట్ లోనే పూనకాలతో ఊగిపోయింది. అప్పుడు అక్కడ చూస్తున్న జనం శాంతిపజేసిన.. కాసేపు అలానే ఊగిపోతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. అంతేకాకుండా యూపీలో ఓ థియేటర్లోకి విభూతి కాషాయ యోగులు అఖండ తాండవం చూసి, సీట్ల నుండి లేచి కరతాళ ధ్వనులతో ఉప్పొంగిపోయారు. శివయ్యగా కనిపించి తాండవం చేసిన బాలయ్యను స్మరిస్తూ తమ శక్తిని, భక్తిని చూపించారని వారు కొనియాడారు.
ఒంగోల్ సినిమా చూస్తూ ఉంటే పూనకం వచ్చింది #Akhanda2Thaandavam #Balayya pic.twitter.com/EHiu91E8lD
— The South Cinemaa (@southcinemaaaa) December 15, 2025
ఇదిలా ఉంటే.. ‘అఖండ 1’లో, పిల్లల జోలికి, ధర్మం జోలికి, ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో చూపించారు బాలకృష్ణ. ఈ క్రమంలో దేవుడు మనిషిలో పూనాడు. ఇప్పుడు ఈ ‘అఖండ 2’లో, మనిషే దేవుడైతే ఏమౌతుందో చూపించారు. ఇందుకలో బాలయ్య బాబు అఘోర కనిపించిన తీరుకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈసారి బాలయ్య బాబు రెట్టింపు ఎనర్జీతో నట తాండవం చేశాడు. డైలాగ్స్తో యూత్లో పీక్ లెవల్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్కి పలుచోట్ల థియేటర్లో స్పీకర్లు సైతం పగిలిపోయాయి. ఇంతలా తాండవం చేస్తున్న ‘అఖండ 2’తో బాలయ్య బాబు ఖాతాలో మరింత కొత్త ఫ్యాన్స్ చేరిపోవడం ఖాయం!!
