రజినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

V6 Velugu Posted on Apr 01, 2021

  • ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించిన కేంద్రం

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు 2019 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఈ దాదాసాహెబ్ అవార్డుకు సంబంధించి  51వ అవార్డును రజినీకి ఇస్తున్నట్లు కేంద్రమంత్రి జవదేకర్  ప్రకటించారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని గొప్ప నటుల్లో రజినీకాంత్ ఒకరని జవదేకర్ ప్రశంసించారు. నటుడిగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా సినిమా రంగంలో రజినీ చెరగని ముద్ర వేశారని కేంద్ర మంత్రి జవదేకర్ అన్నారు.

రజినీని ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసిన టీంలో అయిదుగురు సభ్యులున్నారు. ఆ జ్యూరీలో ఆశాభోంస్లే, సుభాష్ ఘోయ్, మోహన్ లాల్, శంకర్ మహదేవన్, బిశ్వజీత్ ఛటర్జీ సభ్యులుగా ఉన్నారు.

Tagged Movies, prakash javadekar, Actor Rajinikanth, Dadasaheb Phalke Award

Latest Videos

Subscribe Now

More News