న్యూఢిల్లీ : బిలియనీర్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం 2030 నాటికి 45 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడానికి, అప్పుల చెల్లింపుల కోసం గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ. 9,350 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు, ఆర్డోర్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ లిమిటెడ్, అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు ఒక్కొక్కటి రూ. 1,480.75 చొప్పున 6.31 కోట్ల వారెంట్లు జారీ చేసే ప్రణాళికను అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బోర్డు మంగళవారం ఆమోదించింది. రూ. 9,350 కోట్ల పెట్టుబడిని ఏజీఈఎల్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం ఉపయోగిస్తారని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ పెట్టుబడి ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు కంపెనీలో 3.833 శాతం ఈక్విటీ వాటాను ఇస్తుంది. మంగళవారం బీఎస్ఈలో ఏజీఈఎల్ 4.3 శాతం పెరిగి రూ.1,599.90 వద్ద ముగిసింది.
