మీడియా వ్యాపారంలోకి అదానీ...

మీడియా వ్యాపారంలోకి అదానీ...
  • మీడియా వ్యాపారంలోకి అదానీ
  • క్వింటిలియన్ లో 49% వాటా కొనుగోలుకు సిద్ధం

ఆసియాలో అత్యంత సంపన్నుడిగా పేరు గాంచిన అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ తన సామ్రాజ్యాన్ని రోజురోజుకూ విస్తరిస్తూ వస్తున్నారు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ ది బెస్ట్ వ్యాపారవేత్తలలో ముందంజలో నిలుస్తున్నారు. ఇటీవలే ఏసీసీ, అంబుజా సిమెంట్స్ లో వాటాలను దక్కించుకోవడంతో అదానీ గ్రూపు ఇండియాలోనే రెండో  అతిపెద్ద సిమెంటు కంపెనీగా అవతరించి రికార్డు సృష్టించింది. తాజాగా మీడియా వ్యాపారంలోకి  అదానీ గ్రూపు అడుగుపెట్టి మరో కొత్త ఆవిష్కరణకు తెరలేపింది. డిజిటల్ బిజినెస్ న్యూస్ ఫ్లాట్ ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రై.లి. (క్యూబీఎంఎల్) లో 49శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు ఎక్సేంజీలకు సమాచారమిచ్చింది.