అదానీ గ్రూప్ సంస్థ పెన్నా సిమెంట్ను కొనుగోలు చేసింది.అదానీ గ్రూప్ లో భాగమైన అంబుజా సిమెంట్ సంస్థ పెన్నా సిమెంట్ ను దాని మార్కెట్ వాల్యూ రూ.10వేల 422 కోట్లకు సొంతం చేసుకుంది. పి ప్రతాప్ రెడ్డి కుటుంబం నుంచి పీసీఐఎల్ 100 శాతం షేర్లను అంబుజా సిమెంట్ కొనుగోలు చేసింది.
పెన్నా సిమెంట్ ఇండస్ట్రీయల్ లిమిటెడ్ కంపెనీ 14 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి కెపాసిటీని కలిగి ఉంది. అందులో 10 మిలియన్ టన్నులు ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది. మిగిలినవి కృష్ణపట్నం లో 2 మిలియన్ టన్నులు, జోథ్ పూర్ లో 2 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పతికి నిర్మాణంలో ఉంది. ఇది ఆరు నెలల నుంచి 12 నెలల్లో పూర్తి కానుంది. దాదాపు 90 శాతం సిమెంట్ రైల్వే సైడింగ్ ల ద్వారా వస్తుంది. మిగతాది క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్, వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్ ద్వారా వస్తుంది.
PCIL లొకేషన్, తగినంత సున్నపు రాయి నిల్వలు, అదనుపు పెట్టుబడి ద్వారా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. పెన్నా కు చెందిన బల్క్ సిమెంట్ టెర్మినల్స్ దేశంలోని తూర్పు, దక్షిణ భాగాలకు సిమెంట్ అందించడం ద్వారా ఈ రంగంలో గేమ్ ఛేంజర్ గా ఉంది.
అదానీ సిమెంట్ ప్రస్తుతం అల్ట్రా టెక్ సిమెంట్ సెక్టార్ లో రెండో స్థానంలో ఉంది. అదానీ గ్రూప్ ప్రతిష్టాత్మకమైన సిమెంట్ ప్లాన్ల కోసం 3బిలియన్ డాలర్ల పెట్టుబడులను సిద్దం చేసింది. నిర్మాణ సామాగ్రి పరిశ్రమలో అవకాశాలను పొందేందుకు అనుగుణంగా అదానీ గ్రూప్ విస్తరణ ప్రణాళికలు చేస్తోంది.
అంబుజా సిమెంట్ లిమిటెడ్ కంపెనీ దాని అనుబంధ సంస్థలతో కలిసి ఏటా 78.9 మిలియన్ టన్నుల సిమెంట్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా 18 ఇంటిగ్రేటెడ్ సిమెంట్ తయారీ ప్లాంట్లు , 19 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు సిమెంట్ ఉత్పత్తిలో ఉన్నాయి. ఇటీవల సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను కూడా కొనుగోలు చేసింది అంబుజా సిమెంట్.