అదానీ చేతికి గోపాల్​పూర్ ​పోర్ట్ .. డీల్​ విలువ రూ.3,500 కోట్లు

అదానీ చేతికి గోపాల్​పూర్ ​పోర్ట్ .. డీల్​ విలువ రూ.3,500 కోట్లు

న్యూఢిల్లీ:  షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తన బ్రౌన్‌‌ఫీల్డ్ గోపాల్‌‌పూర్ పోర్ట్‌‌ను అదానీ పోర్ట్స్  సెజ్​ లిమిటెడ్‌‌కు రూ.3,350 కోట్ల ఎంటర్‌‌ప్రైజ్ విలువకు విక్రయిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఒడిశాలో నిర్మాణంలో ఉన్న గోపాల్‌‌పూర్ ఓడరేవును 2017లో ఎస్పీ గ్రూప్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇది 20 ఎంటీపీఏ కార్గోను (మిలియన్​టన్స్​పర్​ఆనమ్​) హ్యాండిల్ చేయగలదు. గ్రీన్‌‌ఫీల్డ్ ఎల్‌‌ఎన్‌‌జి రీగ్యాసిఫికేషన్ టెర్మినల్‌‌ను ఏర్పాటు చేయడానికి పోర్ట్ ఇటీవలే పెట్రోనెట్ ఎల్‌‌ఎన్‌‌జీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఎస్పీ గ్రూపు  ఇంతకుముందు మహారాష్ట్రలోని ధర్మతార్ పోర్ట్‌‌ను జేఎస్​డబ్ల్యూ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌‌కు రూ.710 కోట్ల  ఎంటర్‌‌ప్రైజ్ విలువకు అమ్మింది. ఇది 2015లో ధరమ్‌‌తర్ పోర్ట్‌‌ను కొనుగోలు చేసింది. గోపాల్‌‌పూర్ పోర్ట్ లిమిటెడ్‌‌లో ఎస్‌‌పీ గ్రూప్‌‌కు ఉన్న  56 శాతం, ఒరిస్సా స్టీవెడోర్స్ లిమిటెడ్ (ఓఎస్‌‌ఎల్)కు ఉన్న 39 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు డెఫినిటివ్​అగ్రిమెంట్​ను కుదుర్చుకున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్​ఈజెడ్​) తెలిపింది.

  ఏపీసెజ్​​ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ మాట్లాడుతూ, గోపాల్‌‌పూర్ పోర్ట్‌‌ 2024 ఆర్థిక సంవత్సరంలో సుమారు 11.3 ఎంఎంటీ కార్గోను నిర్వహిస్తుందని, రూ. 520 కోట్ల ఆదాయాన్ని  ఆర్జిస్తుందని చెప్పారు. ఇబిటా  రూ. 232 కోట్లు ఉంటుందని వివరించారు.  గోపాల్‌‌పూర్ పోర్ట్​ ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, ఇల్మెనైట్  అల్యూమినాతో సహా వివిధ రకాల డ్రై బల్క్ కార్గోను రవాణా చేస్తుంది.