82 % పెరిగిన అదానీ పోర్ట్స్​ లాభం

82 % పెరిగిన అదానీ పోర్ట్స్​ లాభం

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్​ స్పెషల్ ఎకనామిక్ జోన్స్​(ఏపీసెజ్) ఈ ఏడాది జూన్​తో మొదటి మొదటి క్వార్టర్​లో నికరలాభం 82.6 శాతం పెరిగి రూ.2,114.7 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం మొదటి క్వార్టర్​లో రూ.1,158.3 కోట్ల లాభం వచ్చింది. 

కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.6,247.6 కోట్లుగా ఉంది. వార్షికంగా ఇది 23.5 శాతం పెరిగింది. వడ్డీ, పన్నులు, తరుగుదల, అప్పుల చెల్లింపు (ఇబిటా) ముందు కంపెనీ ఆదాయాలు రూ.3,766 కోట్లుగా ఉన్నాయి. వార్షికంగా ఇది 80.2 శాతం పెరిగింది.  

ఇబిటా మార్జిన్ 60.3 శాతంగా ఉంది. ఇది సంవత్సరం క్రితం కాలంలో 41.3 శాతంగా ఉంది. కంపెనీ  మొదటి క్వార్టర్​లో 101.4 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) పోర్ట్ కార్గో వాల్యూమ్‌‌‌‌లను సాధించింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికం.