జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో గెలిచేది కాంగ్రెస్సే : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో గెలిచేది కాంగ్రెస్సే : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
  • ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీపై ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అక్కడి జనం అధికార పార్టీనే గెలిపిస్తారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సిటీలోని కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌కు జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఎలా పట్టం కట్టారో.. అదే మాదిరిగా జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో కూడా అధికార పార్టీనే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో బుల్డోజర్లతో విధ్వంసం చేసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, కారు గుర్తును వద్దనుకునే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు అధికారం ఇచ్చిన విషయాన్ని హరీశ్‌‌‌‌‌‌‌‌ గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. ఈ ఉప ఎన్నికలో బావ బామ్మర్దులు తెలంగాణ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను ఎంత రాజేసినా జనం నమ్మే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కే పట్టం కట్టడం ఖాయమని స్పష్టం చేశారు.