యాదగిరిగుట్టలోని పాతగుట్ట రోడ్డు 50 ఫీట్ల వరకు విస్తరణ : అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు

యాదగిరిగుట్టలోని  పాతగుట్ట రోడ్డు 50 ఫీట్ల వరకు విస్తరణ :  అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు
  • యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలోని పాతగుట్ట రోడ్డును 50 ఫీట్ల వెడల్పుతో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టే పాతగుట్ట రోడ్డును మంగళవారం అధకారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  50 ఫీట్లకు తగ్గకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. 

రోడ్డు విస్తరణ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహకరించాలని, ఏవైనా సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, మున్సిపల్ సిబ్బంది తదతరులు ఉన్నారు.