మోడల్ విలేజీని సందర్శించిన అడిషనల్ ​కలెక్టర్

మోడల్ విలేజీని సందర్శించిన అడిషనల్ ​కలెక్టర్

బెజ్జంకి, వెలుగు: మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల మోడల్ విలేజీ అయినా వీరాపూర్ గ్రామన్ని గురువారం అడిషనల్​కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించారు. లబ్ధిదారులతో జీపీ ఆఫీస్ వద్ద సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామంలో 77 ఇండ్లు మంజూరైనవని 33 లబ్ధిదారులు  పనులు ప్రారంభించగా బేస్​మెంట్ లెవల్ లో 22 ఇండ్లు పురోగతిలో ఉన్నాయన్నారు. 8 మంది లబ్ధిదారులకు లక్ష చొప్పున వారి ఖాతాలో జమ చేశామని, మిగతా 44 మంది లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. 

కొందరి లబ్ధిదారులకు టెక్నికల్ ప్రాబ్లం ద్వారా డబ్బులు పడలేదని సోమవారం వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిబంధన ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.  సమావేశంలో హౌసింగ్ డీఈ దామోదర్ రెడ్డి, ప్రవీణ్, ఎంపీ వో మంజుల, ఏఈపీఆర్ సమ్మయ్య, ఏపీఎం నరసయ్య, జీపీ కార్యదర్శి పాల్గొన్నారు.