రాష్ట్రంలో ఫాక్స్‌‌‌‌కాన్ అదనపు పెట్టుబడులు

రాష్ట్రంలో ఫాక్స్‌‌‌‌కాన్ అదనపు పెట్టుబడులు

రూ.3,300 కోట్లు ఇన్వెస్ట్‌‌‌‌ చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీ
హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాపిల్  కాంట్రాక్ట్‌‌‌‌  మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌ తెలంగాణలో అదనంగా  400 మిలియన్ డాలర్లు (రూ.3,300 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది.  ఎఫ్‌‌‌‌ఐటీ హాన్ టెంగ్‌‌‌‌ లిమిటెడ్ (ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌) బోర్డు ఈ అదనపు ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఆమోదం  తెలిపిందని ఫాక్స్‌‌‌‌కాన్ ఇండియా రిప్రెజెంటివ్‌‌‌‌ వీ లీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘చాంగ్‌‌‌‌ యీ ఇంటర్‌‌‌‌కనెక్ట్‌‌‌‌ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో అదనంగా 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌‌‌‌ చేయనుంది. 
ఈ కంపెనీలో 99.99 శాతం వాటా ఎఫ్‌‌‌‌ఐటీ సింగపూర్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ ఉంది’ అని ఎఫ్‌‌‌‌ఐటీ హాంగ్‌‌‌‌ టెంగ్‌‌‌‌ హాంకాంగ్‌‌‌‌ స్టాక్ ఎక్స్చేంజ్‌‌‌‌కు శుక్రవారం తెలియజేసింది. రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ పెట్టేందుకు 15‌‌‌‌‌‌‌‌0 మిలియన్ డాలర్లను ఫాక్స్‌‌‌‌కాన్ ఇన్వెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా మరో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మొత్తం కంపెనీ పెట్టుబడులు 550 మిలియన్ డాలర్లకు పెరిగాయి. 
కంపెనీ డిస్‌‌‌‌క్లోజర్‌‌‌‌‌‌‌‌ను వీ లీ  ఎక్స్‌‌‌‌లో పోస్ట్ చేశారు. ‘చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. తెలంగాణకు మరో 400 మిలియన్ డాలర్లు వస్తున్నాయి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌‌‌‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌తో తమ ఫ్రెండ్‌‌‌‌షిప్ బలంగా ఉందని, ఇరువురం ముందుగానే  పెట్టుకున్న కమిట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను ఫాలో అవుతున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 550 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌తో  ఎఫ్‌‌‌‌ఐటీ తన హామీని నిలబెట్టుకుందని  అన్నారు. 
తెలంగాణ స్పీడ్‌‌‌‌కు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ ద్వారా రాష్ట్రంలో డైరెక్ట్‌‌‌‌, ఇన్‌‌‌‌డైరెక్ట్‌‌‌‌గా 25 వేల జాబ్స్ వస్తాయని కేటీఆర్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కొత్త  ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ కొంగర కలాన్‌‌‌‌లో ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది మేలో  ఫాక్స్‌‌‌‌కాన్ శంకుస్థాపన చేసింది.