
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: విద్యార్థులకు విద్యతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యమని, అది భవిష్యత్ను నిర్ణయిస్తుం దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం భోరజ్ మండలంలోని గిమ్మలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి కలెక్టర్హాజరై మాట్లాడారు.
ఆరోగ్యపరమైన అలవాట్లు చిన్న వయసులోనే అలవర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. శుభ్రత, పౌష్టికాహారం, వ్యాయామం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. హెచ్ఎం పద్మజ, ఆర్పీ అజయ్, టీచర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.