ఓటర్ జాబితాపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ రాజర్షి షా

ఓటర్ జాబితాపై  అవగాహన కల్పించాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే ప్రచురించిన ఓటర్ జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో గ్రామ పంచాయతీ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గురించి చర్చించారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే 30వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయంలో  తెలియజేయాలన్నారు.

సవరణలు చేసి తుది జాబితా ప్రచురణ కోసం జిల్లా పంచాయితీ అధికారికి సమర్పించాలని ఎంపీడీవోలకు సూచించారు. సెప్టెంబర్ 2న ఓటర్లు, పోలింగ్ తుది ముసాయిదా జాబితాను ఎంపీడీవో కార్యాలయంలో ప్రచురించాలని సూచించారు.