ధర్నాలతో హోరెత్తిన ఆదిలాబాద్ కలెక్టరేట్

ధర్నాలతో హోరెత్తిన ఆదిలాబాద్ కలెక్టరేట్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేస్తూ సోమవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆదిలాబాద్​కలెక్టరేట్ ​ముందు ఆందోళను దిగారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పింఛన్​ డబ్బులు పెంచాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్​పీ), ఎమ్మార్పీఎస్​ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 

నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించి, పెండింగ్​వేతనాలు చెల్లించాలని కోరుతూ 104 ఉద్యోగుల ఆందోళన చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేంతవరకు నిరసన తెలుపుతామని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో వీహెచ్​పీ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్​రాజ్, సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంక రాఘవులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, 104 ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.