ముళ్ల పొదల్లో మగశిశువు

ముళ్ల పొదల్లో మగశిశువు

ఆదిలాబాద్, వెలుగు : అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో పడేశారు. ఈ ఘటన ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా భీంపూర్‌‌‌‌ మండలంలోని నిపాని గ్రామ శివారులో వెలుగు చూసింది. గురువారం తెల్లవారుజామున ముళ్లపొదల్లో శిశువు ఏడుపు వినబడడంతో గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని శిశువును బయటకు తీశారు.

అనంతరం స్నానం చేయించి పోలీసులు, 108కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న 108 సిబ్బంది శిశువుకు వైద్య పరీక్షలు చేశారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తరలించారు. శిశువును ఎవరు పడేసి ఉంటారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.