
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా 44, 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసరంగా బయటికి వెళ్లేవారు వడగాలుల నుంచి ఉపశమనం కోసం గొడుగులు, స్కార్పులు ధరించి ప్రయాణిస్తున్నారు. భానుడి ప్రతాపానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ తగ్గకపోవడంతో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు.
అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండపూర్ లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జన్నారంలో 45.8 డిగ్రీలు, కవ్వాల్ టైగర్ జోన్ లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనాలు బయటకు రావాలంటనే భయపడుతున్నారు.