స్టేట్ లెవల్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక

స్టేట్ లెవల్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక

కోల్​బెల్ట్, వెలుగు: బాలబాలికలు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి పతకాలు సాధించాలని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా హ్యాండ్​ బాల్​అసోసియేషన్​ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్​అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అండర్​12 బాలబాలికల ఉమ్మడి జిల్లా జట్ల కోసం శనివారం మందమర్రి సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో ఎంపిక పోటీలు నిర్వహించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో కూడిన జట్లను ప్రకటించారు. లికల జట్టుకు ఎస్.గంగుబాయి, కె.మౌనిక, ఎస్.వైష్ణవి, ఎ.పార్వతి, ఎస్.జయశ్రీ, సహస్ర మోక్షిత ఎంపికయ్యారు. 

బాలుర జట్టుకు ఓ.సాత్విక్, రుత్విక్​ వర్మ, కె.జషువా, జి.ప్రణయ్, డి.వంశీ, కె.పాత్రు ఎంపికయ్యారు. వీరు ఆదివారం హైదరాబాద్​లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కోచ్ సునార్కర్ అరవింద్, పీడీ సంతోష్, పీఈటీ రాధారాణి తదితరులు పాల్గొన్నారు.