ఆదిపురుష్ బాగోలేదన్నాడని.. రివ్యూ ప్రేక్షకుడిని కొట్టిన ఫ్యాన్స్

ఆదిపురుష్ బాగోలేదన్నాడని.. రివ్యూ ప్రేక్షకుడిని కొట్టిన ఫ్యాన్స్

ఆదిపురుష్ సినిమా ధియేటర్లలో సందడి చేస్తుంది. ఫస్ట్ డే ఇప్పటికే రెండు షోలు పడ్డాయి. రామాయణాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించినట్లు ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మూవీపై డివైడ్ టాక్ నడుస్తుంది. ఫ్యాన్స్ సూపర్ అంటుంటే.. ఆడియన్స్ మాత్రం పర్వాలేదంటున్నారు. 

ఫస్ట్ డే ధియేటర్ల దగ్గర ఆడియన్స్ ఓపీనియన్ తీసుకోవటానికి చాలా ఛానెల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ సినీ ప్రేక్షకుడు ఆదిపురుష్ చూసి బయటకు వచ్చాడు. అతని అభిప్రాయం కోరగా.. సినిమా బాగోలేదని.. ప్రభాస్ యాక్టింగ్ బాగుందని.. కాకపోతే అతన్ని సరిగా చూపించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆచార్య సినిమాలో గ్రాఫిక్స్ లెవల్లో.. ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఉన్నాయంటూ కామెంట్ చేశాడు. బాహుబలిలో రాయల్టీ ఉందని.. అసలు ప్రభాస్ ను సరిగా చూపించలేదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

ప్లే స్టోర్ లోని గేమ్స్ లోని గ్రాఫిక్స్ తరహాలో.. రాక్షసులు ఉన్నారని.. ప్రభాస్ కష్టం, నటన తప్పితే సినిమాలో ఏమీ బాగోలేదంటూ కామెంట్స్ చేశాడు ఓ ప్రేక్షకుడు. ఈ యువకుడి రివ్యూను పక్కనే ఉండి వింటున్న ప్రభాస్ ఫ్యాన్స్ మండిపోయారు. సినిమా బాగోలేదు అంటావా అంటూ రెచ్చిపోయి.. ఆ ప్రేక్షకుడిని కొట్టారు. 

ధియేటర్ ముందే.. మీడియా ఎదుటే ఫ్యాన్స్.. ఆ ప్రేక్షకుడిని చితకబాదారు. పక్కన ఉన్న మిగతా వాళ్లు అడుకోవటంతో సరిపోయింది కానీ.. లేకపోతే ఇంకేం చేసేవారో.. రివ్యూ చెబుతున్న ఓ ప్రేక్షుడిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.