
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పాన్ ఇండియా లెవల్ లో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ డ్రామాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురినిగా సైఫ్ అలిఖాన్ నటిస్తున్నాడు. అయితే, శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదిపురుష్ టీం ఒక పోస్టర్ ని విడుదల చేసింది. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫొటో ప్రతి రూపంగా ఈ పోస్టర్ ని నిర్మించారు. ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్’ అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది.
ఈ పోస్టర్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. రాముడికి తలపై కిరీటం లేదని, అతడికి ఇచ్చిన దుస్తుల్లో, లుక్స్ లో సాత్వికం కనిపించలేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రాముడి లుక్ కంటే.. సీత లుక్ పైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. సీతకు ఒక శాలువ లాంటిది కప్పడంపై విమర్శలకు తావిస్తోంది. అటు లక్ష్మణుడి పాత్రలో కూడా భక్తిభావం కాకుండా, వీరత్వం కనిపిస్తోందని అంటున్నారు విమర్శకులు.