
దండేపల్లి, వెలుగు: ఈనెల 21 ఆదివాసీలు నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా బంద్ను సక్సెస్ చేయాలని ఆదివాసీ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివాసీల ఉనికి, మనుగడను దెబ్బతీసే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాజెక్ట్‌ను ఆసిఫాబాద్ జిల్లాకు విస్తరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవో 49ను రద్దు చేయాలని కోరుతూ ఆదివాసీ సంఘాలు తలపెట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, వాణిజ్య వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సక్సెస్ చేయాలని కోరారు.
జిల్లా గౌరవ అధ్యక్షుడు కోవ దేవ్ రావ్, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కనక జంగు, అదివాసీ సేన మండల యూత్ అధ్యక్షుడు మంగం సంతోష్, తుడుందెబ్బ ప్రచార కార్యదర్శి మడావి హన్మంతు, లాల్ సాబ్, తొడసం జంగు, కనక పున్నంచంద్ తదితరులు పాల్గొన్నారు.
బంద్‌కు సహకరించాలి
కాసిపేట, వెలుగు: జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఇచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు సహకరించాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంద్రం హన్మంతు, జిల్లా గౌరవ అధ్యక్షుడు సండ్ర భూమయ్య కోరారు. కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తుడుందెబ్బ బంద్ను కార్మికులు, కర్షకులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రవేట్ స్కూళ్లు బంద్ చేసి మద్దతివ్వాలన్నారు. నాయకులు ఆత్రం జంగు, ఎస్.రాధ, ధర్మారావు, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.