ఆదివాసీ సంక్షేమ పరిషత్ కీలక తీర్మానం

ఆదివాసీ సంక్షేమ పరిషత్ కీలక తీర్మానం

జైనూర్, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలోని  సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాడుదామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తీర్మానించింది. ఆదివారం జైనూర్​లోని  కర్ణంగూడా ఆర్గానిక్ ఫామ్ హౌస్​లో అనుబంధ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థి సంఘం, ఉద్యోగుల సంఘం, టీచర్స్ యూనియన్ లీడర్లు హాజరయ్యారు. కుమ్రం భీం జిల్లా విద్యార్థి సంఘం నూతన కార్యవర్గ ఎన్నుకున్నారు. ఉద్యోగుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ మెస్రం గంగారాం మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంత హక్కుల పరిరక్షణకై ప్రత్యేక పోరాటం చేయాలన్నారు.. ఏజెన్సీలో 1/70 యాక్ట్ రద్దు చేయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనికై  శాంతియుతంగా పోరాడుదామని కోరారు . హై కోర్ట్ ను ఆశ్రయించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోరేంగ సుంగు, టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొట్నాక్ భీం రావు,స్టూడెంట్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ నైతం బాలు, సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి మెస్రం మనోహర్, మహిళ ప్రెసిడెంట్ గోడం జంగుబాయి పాల్గొన్నారు.