హిట్ 3లోనూ నేనున్నా - అడివి శేష్

హిట్ 3లోనూ నేనున్నా - అడివి శేష్

అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను రూపొందిస్తున్న చిత్రం ‘హిట్2’. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే సినిమా ఎలా ఉంటుందనేది చూపించాం. ఇది  ప్రేక్షకులందరికీ బిగ్గెస్ట్ సెలెబ్రేషన్. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నాని నాకు సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్ సినిమా ఇస్తున్నందుకు హ్యాపీ.  ఎప్పుడూ ఫైట్స్ చేసే నేను..ఇందులో డ్యాన్స్ కూడా చేశా. ‘హిట్’ అనేది శైలేష్ విజన్. ఈ యూనివర్స్‌‌‌‌‌‌‌‌లో పార్ట్‌‌‌‌‌‌‌‌2 ఇంపార్టెంట్ భాగం. అలాగే ‘హిట్‌‌‌‌‌‌‌‌3’లో నేనూ ఉన్నందుకు హ్యాపీ’అన్నాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ అంది మీనాక్షి. ‘ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమా మూడ్ చూపించాం, డిసెంబర్ 2న రాబోతున్న సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’అన్నాడు శైలేష్. నటులు శ్రీనాథ్ మాగంటి, పావని పాల్గొన్నారు.