
డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తోన్న అతికొద్ది మంది హీరోస్లో ఒకరు అడివి శేష్ (AdiviSesh). యాక్టింగ్, రైటింగ్‌తో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.
ప్రస్తుతం అడవి శేష్ ఖాతాలో రెండు పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’(DACOIT)ఒకటి. ఒక ప్రేమ కథ అనేది ట్యాగ్‌లైన్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.
నేడు మే26న ‘డెకాయిట్’నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. లేటెస్ట్గా ‘డెకాయిట్’మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘మీరు అగ్నిని చూస్తారు. మీరు అందుకు గల ఉద్దేశ్యాన్ని చూస్తారు. మీరు డెకాయిట్ను చూస్తారు. ప్రేమ. కోపం. ప్రతీకారం’ అంతకుమించి చూస్తారంటూ గ్లింప్స్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో శేష్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించడం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
From ROMANCE to RAGE ❤🔥
— Annapurna Studios (@AnnapurnaStdios) May 26, 2025
Witness a wicked fire between exes 🔥#DACOITFire out now!
Telugu - https://t.co/oEaTBwyO8l
Hindi - https://t.co/v6PaMdlifX#DACOIT IN CINEMAS WORLDWIDE ON DECEMBER 25th 💥#DacoitFromDec25th@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 @Deonidas… pic.twitter.com/XAWEYgXXnD
టీజర్ మృణాల్ ఎమోషనల్ లుక్స్ తో స్టార్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ లో అడవి శేష్ ఎమోషనల్ డైలాగ్ చెప్పినట్టుగానే చెప్పి ఓ రకమైన స్మైల్ తో 'హే జూలియట్.. అందరు నిన్ను మోసం చేయడానికి వచ్చారు. కానీ, నేను నిన్ను మోసం చేయడానికి రాలేదు. కుడిపించేయాడానికి వచ్చినాను..' అంటూ తన అసలు నైజాం చూపించాడు. చివర్లో కుడిపించేయానికి వచ్చినాను అనే చిన్న మాటతో సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అడవిశేష్ సినిమాల విషయానికి వస్తే..
అడవిశేష్ చివరగా హిట్ 2 మూవీలో కనిపించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత డెకాయిట్ తో థియేటర్ ఆడియన్స్ ను పలకరిస్తున్నారు. ఇటీవలే హిట్ 3లో చిన్న క్యామియో రోల్ చేసి కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాతో వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
అడవిశేష్ తన సినిమాలతో, స్క్రీన్ రైటర్ గా ప్రత్యకమైన ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ ను సొంతం చేసుకున్నాడు. అడవి శేష్ కెరియర్లో వరుసగా క్షణం, గూడచారి, ఎవరు, మేజర్, హిట్ 2 వంటి విభిన్నమైన కాన్సెప్ట్స్ తో వచ్చి సక్సెస్ అందుకున్నారు. దాంతో అతని సినిమాల కోసం ఎదురుచూసేలా చేసుకున్నాడు. అతి త్వరలో శేష్ నుంచి మరో సూపర్ హిట్ సీక్వెల్ గూఢచారి2తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.