లిటిల్‌‌‌‌ ఫ్యాన్‌‌‌‌కు అడివి శేష్ సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్

లిటిల్‌‌‌‌ ఫ్యాన్‌‌‌‌కు అడివి శేష్ సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్

క్యాన్సర్‌‌‌‌తో పోరాడుతున్న చిన్నారి అభిమాని కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు అడివి శేష్. పాప కుటుంబం కోసం ఓ హోటల్‌‌‌‌లో డే అవుట్‌‌‌‌ను ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలసి ఆశ్చర్యపరిచారు. ఒక రోజంతా ఆ చిన్నారితో సరదాగా ఆడుతూ గడిపి.. తనకు ధైర్యాన్నిచ్చారు. కొన్నాళ్ల క్రితం ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి ద్వారా ఈ లిటిల్ ఫ్యాన్‌‌‌‌ గురించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న శేష్.. వెంటనే ఆ కుటుంబ సభ్యులను సంప్రదించారు.

తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆ ఫ్యామిలీకి భరోసా ఇచ్చిన శేష్.. మెసేజ్‌‌‌‌లు, వీడియో కాల్స్‌‌‌‌ ద్వారా చిన్నారికి కనెక్ట్ అయ్యారు. తనను కలవాలని కోరుకుంటున్న ఆ చిన్నారి కోసం ఇలా క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసి తన గొప్ప మనసుని చాటారు అడివి శేష్.