విశ్వక్‌‌సేన్‌‌కు అద్భుతమైన టాలెంట్ ఉంది : అడివి శేష్

విశ్వక్‌‌సేన్‌‌కు అద్భుతమైన టాలెంట్ ఉంది : అడివి శేష్

విశ్వక్‌‌ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్  క్రౌండ్ ఫండింగ్‌‌తో నిర్మించిన చిత్రం ‘గామి’. యూవీ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు గెస్ట్‌‌గా హాజరైన  అడివి శేష్ మాట్లాడుతూ ‘విశ్వక్‌‌సేన్‌‌కు అద్భుతమైన టాలెంట్ ఉంది. తను ఇండస్ట్రీలో నిజాయితీ గల నటుడు. ‘గామి’ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని కోరుకున్నా. 

మహా శివరాత్రికి విడుదలవుతున్న ఈ చిత్రాన్ని థియేటర్స్‌‌లో సెలబ్రేట్ చేద్దాం’ అని  చెప్పాడు. దర్శకులు అజయ్ భూపతి, వశిష్ట, హను రాఘవపూడి, నవదీప్, నిర్మాత ఎస్‌‌కేఎన్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.   విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఆలోచనతో మొదలై మనసులో నిలిచిపోయే సినిమా ఇది.  కొత్తరకం కాన్సెప్ట్  చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది గొప్ప సంతృప్తిని ఇస్తుంది’ అన్నాడు. ఈ మూవీ షూటింగ్ ఒక సాహస యాత్ర లా జరిగింది అని చెప్పింది చాందిని.  ‘ఇదొక ఇంటెన్స్ ఎమోషనల్ ఫిల్మ్.  ఒక ఎపిక్ సినిమా తీశామని నమ్ముతున్నాం’ అన్నాడు విద్యాధర్. టీమ్ అంతా పాల్గొన్నారు.