సైనిక స్కూల్స్​లో అడ్మిషన్స్​

సైనిక స్కూల్స్​లో అడ్మిషన్స్​

కరీంనగర్‌‌ జిల్లా రుక్మాపూర్‌‌లో బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023–24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో 80 అడ్మిషన్స్​కు అర్హులైన బాలుర నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. 

అర్హత: 2022–23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు.

సెలెక్షన్​ ప్రాసెస్: మూడంచెల్లో ఉంటుంది. స్టేజ్–1 100 మార్కులకు రాతపరీక్ష, స్టేజ్–2లో  ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్​, స్కిల్ టెస్టు ఉంటాయి. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.tswreis.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

ఇంటర్​ అడ్మిషన్స్​ 

రుక్మాపూర్‌‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో  పదకొండో తరగతిలో 80 అడ్మిషన్స్​కు అర్హులైన బాలుర నుంచి ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతి పరీక్షకు హాజరైన/ ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 16 ఏళ్లు మించకూడదు. ఫిబ్రవరి 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించనున్నారు.