- త్వరలో పర్మిషన్ ఇస్తామన్న యూజీసీ చైర్మన్ జగదీశ్
- ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నరు
- ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, పోటీతత్వం పెరుగుతాయి
- ఏటా రెండు సార్లు క్యాంపస్ రిక్రూట్ మెంట్లతో ఉపాధి పెరుగుతది
- సౌలత్లు, వనరులు ఉన్న వర్సిటీలకే అవకాశం ఇస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని యూనివర్సిటీలు, హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఇక నుంచి ఏటా రెండుసార్లు అడ్మిషన్లు తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు. 2024–-25 అకడమిక్ ఇయర్ నుంచి రెండు అడ్మిషన్ సైకిల్స్ మొదటిది జులై–-ఆగస్టు, రెండోది జనవరి–ఫిబ్రవరి ఉంటాయన్నారు. ‘‘ఇండియన్ వర్సిటీలు ఏటా రెండుసార్లు అడ్మిషన్లు ఇవ్వగలిగితే, బోర్డుల రిజల్ట్స్ లేటు అవడం, హెల్త్, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల జులై–-ఆగస్టు సెషన్‌లో అడ్మిషన్‌ను తీసుకోలేని స్టూడెంట్లకు ప్రయోజనం చేకూరుతుంది” అని జగదీశ్ కుమార్ పీటీఐతో తెలిపారు.
‘‘వర్సిటీల్లో ఏటా రెండు సార్లు అడ్మిషన్లతో స్టూడెంట్లు ఒక సారి అడ్మిషన్ రాకపోతే ఏడాదంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదన్నారు. ప్రస్తుత అడ్మిషన్ సైకిల్ ప్రకారం ఒకసారి అడ్మిషన్ రాకుంటే ఏడాదంతా వేచి ఉండాల్సి వస్తుందన్నారు. అలాగే ఇండస్ట్రీస్, కంపెనీలు ఏటా రెండు సార్లు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లను చేపడతాయి. గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి” అని అన్నారు.
బెస్ట్ యాక్షన్ ప్లాన్‌కు చాన్స్
ఏటా రెండుసార్లు అడ్మిషన్ల విధానంతో వర్సిటీలు, హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ల్యాబ్‌లు, క్లాస్ రూమ్స్ ఇంతర సపోర్టింగ్ సర్వీసుల వంటి రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరింత సమర్థవంతంగా చేసేందుకు వీలుంటుందన్నారు. బెస్ట్ యాక్షన్ ప్లాన్‌కు అవకాశం కల్పిస్తాయని జగదీశ్ చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు ఇప్పటికే ఏటా రెండు అడ్మిషన్ల విధానాన్ని అనుసరిస్తున్నాయి.
ఇండియాలో కూడా దీన్ని అనుసరిస్తే.. వర్సిటీలు, హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు మధ్య అంతర్జాతీయ సహకారం, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ మెరుగవుతుంది. దీంతో మా ప్రపంచ పోటీపడేతత్వం పెరుగుతుంది, ఇంటర్నేషనల్ స్టాండడ్స్ కు అనుగుణంగా ఉంటాం” అని అన్నారు. అయితే ఏటా రెండు సార్లు అడ్మిషన్ల విధానం అనుసరించడం యూనివర్సిటీలకు తప్పనిసరి కాదని, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచింగ్ ఫ్యాకల్టీ, సౌలత్లు కలిగినవే ఈ అవకాశాన్ని వియోగించుకుంటాయని జగదీశ్ తెలిపారు.
దీన్ని అనుసరించే సంస్థలు అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడం, వనరులు పెంచుకోవడం, స్టూడెంట్లకు ఇబ్బందులు లేని సపోర్ట్ సిస్టమ్ అందించడంపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
