
హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ డివిజన్‌లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025–-26 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ఆఫీసర్ ఎం. విజయ్‌పాల్ రెడ్డి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రీ మెట్రిక్ హాస్టళ్లు.. హుజూరాబాద్, జమ్మికుంట, వావిలాల, వీణవంక, రేకొండ, చిగురుమామిడి, నుస్తులాపూర్, ఇందుర్తి, తిమ్మాపూర్, పోస్ట్-మెట్రిక్ హాస్టళ్లు. హుజురాబాద్, జమ్మికుంట ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు, బోనోఫైడ్, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9399957766 నంబర్‌లో సంప్రదించవచ్చు అని తెలిపారు.